దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నటుడు ఉపేంద్ర సంచలన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్న ట్వీట్

08-12-2019 Sun 09:37 | National
  • నిందితులే దోషులని చెప్పడానికి ఆధారాలు లేవు
  • ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమోనని అనుమానం
  • ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎన్‌కౌంటర్లు ఎందుకు జరగడం లేదు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కన్నడ నటుడు ఉపేంద్ర చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. దిశ హత్యాచార ఘటన వెనక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ ఉపేంద్ర ట్వీట్ చేశాడు. నిజంగా నిందితులే ఆ ఘాతుకానికి పాల్పడినట్టు ఆధారాలు లేవన్నాడు.

ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఇలాంటి ఎన్‌కౌంటర్లు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించాడు. కోర్టులో విచారణకు ముందే ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్నాడు. అప్పట్లో రౌడీయిజాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎన్‌కౌంటర్లు జరిగేవని ఉపేంద్ర గుర్తు చేశాడు. నిజాయతీ కలిగిన పోలీసు అధికారులు మనసు పెడితే ఎన్‌కౌంటర్ ద్వారా అత్యాచారాలను నివారించవచ్చన్నాడు. దీనిని ప్రముఖులు, శ్రీమంతులు దుర్వినియోగం చేయకుండా చూడాలని హెచ్చరించారు.

కాగా, ఉపేంద్ర ట్వీట్‌పై దుమారం రేగుతోంది. కొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తుండగా, మరికొందరు విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీని పెట్టిన నటుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.
DishaEncounterkannada actorUpendra

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more